Sunday, April 28, 2024

National : 11న భార‌త్ లో రంజాన్ ప‌ర్వ‌దిన వేడుక‌లు

ఈ నెల 11 భార‌త్ లో రంజాన్ ప‌ర్వ‌దినంగా ముస్లిం మ‌త పెద్ద‌లు ప్ర‌క‌టించారు.. ఈ మేర‌కు నేడు ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు.. కాగా, ఈద్ అల్-ఫితర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ముఖ్యమైన పండగ. పవిత్ర పండగగా భావించే రంజాన్ మాసం సందర్భంగా భారత్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా ముస్లీంలు నెల రోజులపాటుగా ఉపవాస దీక్షలు చేస్తున్నారు.

ఈ ఉపవాస దీక్ష ముగింపును ఈద్ అల్-ఫితర్ సూచిస్తుంది. ఈరోజుతో ముస్లింలు కొనసాగించిన ఉపవాసాలు విరమిస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ హిజ్రీ ప్రకారం.. ఈ వేడుకతో ఇస్లామిక్ క్యాలెండర్‌లోని పదవ నెల షవ్వాల్ ప్రారంభం అవుతుంది. ఈ షవ్వాల్ మొదటి రోజున ఈద్ అల్-ఫితర్ పండగను ముస్లీంలు ఘనంగా జరుపుకుంటారు.

- Advertisement -

రేపు భార‌త్ లో నెల‌వంక ద‌ర్శ‌నం

ఈద్ అల్-ఫితర్ పండగ నెలవంక దర్శనంతో ముడిపడి ఉంటుంది. నెలవంక కనిపిస్తే పండగ సందడి ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజే పండగను వైభవంగా జరుపుకుంటారు. ఇర సౌదీ అరేబియా, యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ , దుబాయ్, ఖతార్‌ వంటి ముస్లీం దేశాలల్లో రేపు ఈద్ అల్ ఫితర్ జరుపుకోనున్నారు. అయితే, భారత్ లో మాత్రం ఆ మరుసటి రోజున ఈద్ అల్ ఫితర్ గ‌రువారం జ‌రుపుకోనున్నారు. భారత్ లో నెలవంక ఏప్రిల్ 10న కనిపించనుంది. దీంతో ఏప్రిల్ 11న దేశంలోని ముస్లీంలు అందరూ ఈ పండగ జరుపుకోనున్నారు. ఇది ఇలా ఉంటే గ‌తంలో 10వ తేదిని సెల‌వు దినంగా ప్ర‌క‌టించిన ఎపి, తెలంగాణ ప్ర‌భుత్వాలు ఈ సెల‌వును గురువారం అంటే 11 వ తేదికి మార్పు చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement