Tuesday, April 30, 2024

TS : ఎవ‌రి పంచాంగం వారిదే

ఉగాది పర్వదినం రోజున పంచాంగాల్లో పండితులంతా ఒకటే చెప్పరు. ఉగాధి వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లినప్పుడు పండితులు ఆయా రాజకీయ పార్టీలకు అనుకూలంగా పంచాంగ శ్రవణం వినిపిస్తూంటారు. ఈ సారి కూడా అదే పరిస్థితి కనిపించింది. తెలంగాణలోని ఏ పార్టీ ఆఫీసులో ఎలాంటి పంచాంగం చెప్పారో ఓ సారి చూద్దాం.

- Advertisement -

గాంధీభవన్ లో ..ప్ర‌తిప‌క్షం బ‌ల‌హీన‌ప‌డుతుంది…

గాంధీభవన్‌ పంచాంగంలో పండితులు కొన్ని విషయాలను చెప్పారు. పండితులు ఏం చెప్పారంటే..”వచ్చే మూడు నెలల్లో భూ కంపాలు,అగ్ని ప్రమాదాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.. చైనా, పాకిస్థాన్‌ల మీద మనం పైచేయి సాదిస్తాము. పత్రికా రంగం అధిపతి ఒకరు చనిపోతారు.. క్రీడా రంగంలో ఒక ప్రముఖ క్రీడాకారుడు చనిపోతాడు. కేంద్ర ,రాష్ట్ర సిలబస్‌లో చాలా మార్పులు జరుగుతాయి. సిమెంట్, ఇటుక వాడుకలు తగ్గుతాయి.. ప్రతిపక్షం చాలా బలహీన పడుతుంది.. విదేశీ మత్తు పదార్థాలను అరికట్టడం చాలా కష్టం అవుతుంది.

పాన్ ఇండియా మూవీలన్నీ ప్లాప్ అవుతాయి

ప్యాన్ ఇండియా సినిమాలు తీసే నిర్మాతలు చాలా నష్టపోతారు. ఆర్థిక పరమైన సినిమాలు ఎక్కువగా వస్తాయి. సినిమా, రాజకీయ ప్రముఖులలో కొందరు చనిపోతారు.. సినీ రంగంలో భార్య భర్తల మధ్య విడాకుల సంఖ్య ఎక్కువ అవుతాయి. కరోనా సమసి పోలేదు.

స్కామ్ లో నేత‌లు జైలుకు వెళ‌తారు

కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకుల అక్రమ సంబంధాలు బయట పడుతాయి.. తెలుగు రాష్ట్రాలలో గత ప్రభుత్వంలో చేసిన భూ స్కాంలు, అవినీతి బయట పడుతుంది..స్కాంలలో కొందరు నాయకులు అరెస్ట్ అవుతారు. దేవాలయాల అభివృద్ధి జరుగుతుంది. దేశ రాజకీయాల్లో చాలా మార్పు లు జరుగుతాయి.

రేవంత్ రెడ్డికి ఈ ఏడాది అనుకూలం
కొంత మంది ప్రముఖ నేతలు కనుమరుగువుతారు.. 2027 నుంచి 2030 వరకు మన దేశం అగ్ర స్థానంలో ఉంటుంది.. ఒక యోగి మన దేశాన్ని పాలిస్తాడు.. వెండి, బంగారం,ఇత్తడి ధరలు మరింత పెరుగుతాయి. వచ్చే సంవత్సరం వరకు రేవంత్ రెడ్డికి జాతకం బాగుంది…. వచ్చే సంవత్సరం వరకు ఆయనను ఎవరు ఏమి చేయలేరు.. రాహుల్ గాంధీ కొన్ని అనూహ్య స్థానాలు గెలుచుకుంటారు.” అని గాంధీభవన్ పంచాంగంలో తెలిపారు.

బీజేపీ కార్యాలయంలో
బీజేపీ నిర్వహించిన ఉగాది వేడుకల్లో కప్పగంతు సూర్యనారాయణ మూర్తి పంచాంగ శ్రవణం వినిపించారు. బీజేపీ పంచాంగ శ్రవణంలో పండితులు ఏమన్నారంటే..”వర్షాలు కురుస్తాయి, పంటలకు అనుకూలంగా వర్షాలు సకాలంలో కురుస్తాయి. ధరలు తగ్గుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది వ్యాపార వర్గంలో ఉండే వారికి నష్టం కలుగుతుంది. మే, జూన్, జులైలో ముహూర్తాలు లేవు. ఆగస్టు 7 నుండి ముహూర్తాలు. ఈ ఏడాది ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ. దేశీయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ప్రాధాన్యత. ఉత్తర ఈశాన్య భారతంలో భూమిలో కదలికలు… ప్రాణ నష్టం ఉండదు. వ్యక్తిగత వైరాలు పెరిగిన సఖ్యత వస్తుంది. సుస్థిర ప్రభుత్వం వస్తుంది.” అని తెలిపారు.

తెలంగాణ భవన్ పంచాంగ శ్రవణం
“క్రోది నామా సంవత్సరంలో రైతులకు శుభం కలుగుతుంది. ఉత్పత్తి ధరలు ఆకాశానికి అంటే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్‌లో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది. ప్రపంచం అంతా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైతాయి. దేశ సరిహద్దుల్లో పరస్పరం నైశ్యర్యం కలిగే ప్రమాదం ఉంది. దేశ సరిహద్దులోనే కాదు ప్రజల మధ్య పరస్పర మత విద్వేషాలు పెరుగుతాయి. పాలక పక్షంకు ఈ సారి కష్టకాలం ఉంది. ప్రతి పక్షానికి దిగ్విజయం ఉంది.

కెసిఆర్ కు వాహ‌న ప్ర‌మాదం ఉంది..

ఇటీవల భారతదేశంలో గ్రహణాలు కనిపించడం లేదు కనిపిస్తున్నాయి అని భ్రమపడుతున్నాము. క్రోది నామ సంవత్సరంలో చంద్ర గ్రహణం,సూర్య గ్రహణం కనిపించవు. కేసీఆర్‌ రాశి (కర్కాటకం) అత్యంత సంతోషకరంగా ఆదాయ, వ్యయాలు కనిపిస్తున్నాయి. అన్ని వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వారి మాటకు, గమనానికి అడ్డులేని సంవత్సరంగా కనిపిస్తోంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన ప్రమాద సూచన ఉంది కాబట్టి ఎక్కువ ప్రయాణాలు చేయొద్దు. కేసీఆర్ దోష నివారణ కోసం లక్ష్మీ మోహన గణపతిని చవితి నాడు దర్శనం చేసుకోవాలి.” అని తెలంగాణ భవన్‌లో పండితులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement