Tuesday, April 30, 2024

కేక్ తినేసిన స‌న్నీ..ఫైర్ అయిన ఆనీ మాస్ట‌ర్..

బిగ్ బాస్ ఇస్తోన్న టాస్క్ ల‌తో హౌస్ లోని కంటెస్టెంట్ల మ‌ధ్య చిచ్చుపెడుతోంది. అస‌లు ఇవేం టాస్క్ లు అనే తీరుగా ప్రేక్ష‌కులు బోర్ ఫీల‌వుతున్నారు. ఇక సిక్రెట్ రూంలో జెస్సీ ఉన్నాడు. కాగా గార్డెన్ ఏరియాలో కేక్ ముక్క పెట్టారు బిగ్‏బాస్. ఇది తినే అర్హత మీలో ఎవరికి ఉంద‌ని ప్ర‌శ్నించాడు. అయితే ఆ కేక్ తినడానికి మొదటి నుంచి సన్నీ ఆసక్తిగా చూపించాడు. దీంతో ఆనీ మాస్టర్ అతడిని వారించింది. తింటే ఆన్సర్ దొరుకుతుందని సన్నీ అనగా.. కాదు అంటూ అడ్డంగా వాదించింది ఆనీ మాస్టర్. ఇక కేక్ తినే అర్హత ఎవరికి ఉందనే విషయం ఇంటి సభ్యుల మధ్య చర్చ జరిగింది. కెప్టెన్ నేను కాబట్టి… ఆ కేక్ తినే అర్హత నాకే ఉందని చెప్పింది ఆనీ మాస్టర్. దీంతో సన్నీ.. మీకు అర్హత ఉంటే తినండి మరి.. లేదంటే నేను తినేస్తా.. రిస్క్ తీసుకుంటా అని ముందుకు వచ్చాడు సన్నీ. ఇక సీక్రెట్ రూంలో ఉన్న జెస్సీ అభిప్రాయాన్ని అడగ్గా.. రవి 8 వారాలు నామినేషన్స్‏లో ఉన్నాడు… పోరాడుతున్నాడు.. అతనికే అర్హత ఉందని చెప్పాడు జెస్సీ. ఇక ఆ కేక్ ను మానస్‏కు ఇవ్వాలని ఉందని పింకీ చెప్పడంతో.. నువ్వు అన్ని అతనికే ఇచ్చుకో… నేను కనిపించడం లేదా అని సన్నీ అనగా.. పింకీ ఇలా తయారైంది అంటూ పంచ్ వేశాడు రవి.

ఇక కేక్ తింటే ఇమ్యూనిటీ వస్తుందేమో అని రవి అనగా.. అసలు అర్హత ఏంటో తెలియదు అని చెప్పింది కాజల్. ఇక కేక్ తినే విషయంలో ఇంటి సభ్యుల మధ్య చర్చ జరుగింది. ఇక ఉదయాన్నే సన్నీ మానస్‏తో చర్చించి.. కెప్టెన్ అపోచ్చని అక్కడ రాయలేదు కదా.. అంటూ వెళ్లి ఆ కేక్ తినేస్తాడు. ఇక సన్నీ కేక్ తింటున్నంతసేపు మాసన్, శ్రీరామ్ తెగ నవ్వుకున్నారు. అయితే దీంతో సన్నీ.. నాకు కంగారు ఆగదు.. తీటగాడిని.. ఇప్పుడు ఏం పంచాయితీ అవుతుందో అంటూ అనుమానపడ్డాడు. ఇక సన్నీ కేక్ తినేసాడు అని తెలియగానే ఆనీ మాస్టర్ బయటకు వచ్చి నోరెళ్లబెట్టింది. నువ్ కెప్టెన్ అయితే ఇలాగే చేస్తావా. అంటూ సన్నీని అడగ్గా.. అక్కడ కెప్టెన్ రూల్ చేయాలని రాసి లేదు.. ఆకలేసింది తినేశా.. అని చెప్పాడు. ఇది నాది… నువ్వు ఎందుకు తినేశావ్.. స్ట్రాటజీ ప్లే చేశావ్ అంటూ రచ్చ చేస్తూ ఏడ్చేసింది ఆనీ మాస్టర్. మొత్తానికి కేక్‏తో ఇంట్లో మరోసారి రచ్చ జరిగింది. ఇక ఆ తర్వాత ప్రతి సీజన్ మాదిరిగానే ఈ సీజన్‌లోనూ బీబీ హోటల్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అందులో ఇంటి సభ్యులు ఎవరి పాత్రలలో వారు జీవించేశారు. మొత్తానికి బిగ్ బాస్5 ఇలా జ‌రుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement