Wednesday, May 15, 2024

అభివృద్ధి జ‌ర‌గ‌లేదంటే.. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటా…చ‌ర్చ‌కు సిద్ధ‌మా.. ష‌బ్బీర్ అలీ

కామారెడ్డి జిల్లా కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొని షబ్బీర్‌ అలీ హయాంలో అభివృద్ధి జరగలేదని విద్యుత్‌ శాఖ మంత్రిగా ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేదని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యల పై మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ ఘాటుగా స్పందించారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా నా హయాంలో అభివృద్ధి జరగలేదంటే నేను శాశ్వ తంగా రాజకీయాల నుండి తప్పుకుంటా.. లేకుంటే కేటీఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. హుజురాబాద్‌ ఎన్నికల్లో ఓటమి తర్వాత ముఖ్యమంత్రి పదవి రాదేవెూనని కేటీఆర్‌ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడినట్లు అనిపించింద‌న్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. షబ్బీర్‌ అలీ చేసిన అభివృద్ధి రాష్ట్రం అంతటికి రోల్ మోడల్‌ అన్నారు. షబ్బీర్‌ అలీ త్రాగు నీటి గురించి చేపట్టిన గోదావరి జలాలు తన నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి అందించారన్నారు.

కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు విద్యుత్‌ మంత్రి ఉండి నియోజకవర్గానికి విద్యుత్‌ అందించలేదన్నారు. నా హయాంలో కేసీఆర్ స్వంత నియోజకవర్గం గజ్వేల్‌లో 400కేవీ డిచ్ ప‌ల్లిలో 400 కేవిల సబ్ స్టేష‌న్ 220/132 కేవీ సబ్‌ స్టేషన్‌ క్యాసం పల్లిలో ప్రతి మండల కేంద్రంలో 132/33కేవీ, 33/11 కేవీ ప్రతి గ్రామంలో వేల సంఖ్యలో కరెంట్‌ స్తంభాలను మంజూరు చేశానన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఒక్క ఫోల్‌ కూడా మంజూరు చేయలేదన్నారు. రూ.270 కోట్లు ఖర్చు చేసి గోదావరి జలాల ద్వారా ప్రతి ఇంటికి మంచి నీరు అందించానని అన్నారు. రూ.5 కోట్లతో ఇందిరాగాంధీ స్టేడియం నిర్మించడం జరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రెండు డైరీ టెక్నాలజీ ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉంటే ఒకటి కామారెడ్డికి మంజూరు చేయించానన్నారు. ఇప్పటివరకు దానిని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పీజీ కాలేజ్‌ చేయలేకపోయిందన్నారు.

రాజీవ్‌ పార్క్‌ నిర్మించానని అది తప్ప గడిచిన ఏడు సంవత్సరాల్లో ఇంకోపార్క్‌ దిక్కు లేదని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మైనార్టీ గురుకుల పాఠశాలల‌, హాస్టల్‌ భవనం నిర్మించానని అన్నారు. సాగునీటి సమస్య తీర్చడానికి ఎంతో కష్టపడి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తమ జిల్లాకు మంజూరు చేయించి 70 శాతం పూర్తి చేసానని అన్నారు. ధూప దీప నైవేద్యం అందించే కార్యక్రమం చేపట్టడానికి కామారెడ్డిలో నాలుగు వేల ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇచ్చానని తన నియోజకవర్గంలో దాదాపు 10 వేలకు పైగా ఇళ్లు నిర్మించి నిరుపేదలకు ఇచ్చానన్నారు. టిఆర్‌ఎస్‌ హయాంలో ఒక్క డబుల్‌ బెడ్‌ రూమ్‌ కూడా పేదలకు ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. తండ్రి కొడుకులు మళ్లీ తమ ప్రభుత్వం రాదని మతి తప్పిననట్లు మాట్లాడుతున్నారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement