Tuesday, May 7, 2024

BWF | ప్రపంచ నం.1 జోడీగా భారత్ స్టార్ ద్వయం..

ఈ ఏడాది జరిగిన మలేషియా ఓపెన్ సూపర్ 1000 & ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లలో వరుసగా రన్నరప్‌గా నిలిచిన ఆసియా క్రీడల ఛాంపియన్లు రెండవసారి ప్రపంచ నం.1 ర్యాంకింగ్‌కు చేరుకున్నారు. భార‌త స్టార్ జోడీ అయిన సాత్విక్ – చిరాగ్‌లు.. గత రెండు వారాల్లో జ‌రిగిన టోర్నీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చి రన్నరప్‌గా నిలిచారు.

దీంతో తాజాగా బ్యాడ్‌మింటన్ వరల్డ్ ఫెడరేషన్‌ రిలీజ్ చేసిన పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. న్యూ ఢిల్లీలో జ‌రిగిన ఇండియ‌న్ ఓపెన్‌లో ప్రపంచ నం.2గా అడుగుపెట్టిన భారత జోడీ ఇప్పుడు 95861 పాయింట్లతో ప్రపంచ నంబర్1 జోడీగా ఉంది.

ఇక ఇతర భారతీయ షట్లర్లలో H. S. ప్రణయ్ ప్రపంచ 8వ ర్యాంక్‌కు చేరుకోగా, లక్ష్య సేన్, కిదాంబి శ్రీకాంత్, ప్రియాంషు రజావత్‌లు వరుసగా 19, 25, 30 స్థానాల్లో నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement