Sunday, April 28, 2024

Supreeta: హీరోయిన్ గా సురేఖ వాణి కుమార్తె …

తెలుగు బుల్లితెరపై నటి సురేఖవాణి ఆమె కూతురు సుప్రీత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వీరిద్దరూ సోషల్ మీడియాలో కనిపించారంటే చాలు రచ్చ చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో సురేఖ వానికి సినిమా అవకాశాలు తగ్గినప్పటికీ తరచు సోషల్ మీడియాలో కనిపిస్తూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

తనలాగే తన కూతుర్ని కూడా పాపులర్ అయ్యేలా చేసింది సురేఖ వాణి. ముఖ్యంగా వీరిద్దరూ తల్లి కూతుర్లు లాగా కాకుండా అక్కాచెల్లెళ్లు అనేలాగా డాన్సులు చేస్తూ దుస్తులు వేసుకుంటూ ఉంటారు. తాజాగా సుప్రీత ను హీరోయిన్గా చేయాలని సురేఖవాణి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తోంది.

ఎట్ట‌కేల‌కు ఆమె క‌ల నెర‌వేరనుంది.. సుప్రీత హీరోయిన్గా ఏదో సినిమా కన్ఫర్మ్ అయ్యిందని త్వరలోనే అందుకు సంబంధించి పూర్తి వివరాలను కూడా తెలీయ‌జేయ‌నున్న‌ట్లు టాలీవుడ్ టాక్ . ఇక సుప్రీత అటువైపు ట్రైడిష‌నల్, ఇటు గ్లామ‌ర్ ఫోటో షూట్ లతో ర‌చ్చ చేసున్న‌ది.. త‌ల్లికి ఉన్న‌ప‌రిచ‌యాల‌తో ద‌ర్శ‌కుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement