Monday, May 20, 2024

Saif Ali Khan | హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్ అలీఖాన్..

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ బుజం గాయంతో ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయి అంబానీ హాస్పిటల్ లో నిన్న (సోమ‌వారం) సర్జరీ కోసం అడ్మిట్ అయ్యాడు. ఇక చికిత్స పూర్తీ అవ్వడంతో ఇవ్వాల‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు సైఫ్ అలీఖ‌న్. అయితే ఇదివ‌ర‌కే ఉన్న గాయం తిర‌గ‌బ‌టంతో సైఫ్ డాక్టర్స్ ని సంప్రదించిన‌ట్టు తెలుస్తొంది.

ఇక చిన్న స‌ర్జ‌రీ చేయాల‌ని డాక్ట‌ర్లు సూచించ‌డంతో.. నిన్న సైఫ్ అలీఖాన్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. డాక్టర్స్ ఆ మైనర్ సర్జరీని పూర్తి చేసి ఇవ్వాల‌ డిశ్చార్జ్ చేశారు. చికిత్స అనంతరం సైఫ్ అలీఖాన్ చేతి కట్టుతో హాస్పిటల్ నుంచి వచ్చిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement