Thursday, May 16, 2024

ఆక‌ట్టుకుంటోన్న ‘బ‌ట‌ర్ ప్లై’ టీజ‌ర్

బ‌ట‌ర్ ప్లై చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది హీరోయిన్ అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్. ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. సుమారు 40 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో ఎలాంటి డైలాగులు వినిపించవు. టీజర్‌ మొత్తం అనుపమే కనిపిస్తోంది. ‘నీ కళ్లను నమ్మద్దు.. బ్రెయిన్‌ను కూడా నమ్మద్దు.. మరి వేటిని నమ్మాలి’ అంటూ టీజర్ లో వచ్చిన కొన్ని సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దీనిని చూస్తోంటే మిస్టరీ, హార్రర్‌ జోనర్‌లో ఈ సినిమాను తెరకెక్కించారని అర్థమవుతోంది. జెన్‌నెక్స్ట్ మూవీస్ బ్యానర్‌పై రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న “బటర్‌ ఫ్లై” చిత్రానికి ఘంటా సతీష్ బాబు దర్శకత్వం వహించారు. కథ, స్క్రీన్‌ప్లే కూడా ఆయనే అందించారు. అర్విజ్, గిడియన్ కట్టా సంగీతాన్ని అందిస్తుండగా సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. లేడీ ఓరియంటెడ్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని అప్‌డేట్స్ ను త్వరలోనే ప్రకటించనుంది చిత్రబృందం.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement