Saturday, May 4, 2024

Business: ఖాతాల నిర్వాహణకు వివోకు కోర్టు అనుమతి.. 950 కోట్ల గ్యారంటీ ఇవ్వాలని ఆదేశం

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సీజ్‌ చేసిన బ్యాంక్‌ అకౌంట్లను నిర్వహించేందుకు మొబైల్‌ ఫోన్ల కంపెనీ వివోకు ఢిల్లి హైకోర్టు అనుమతించింది. ఇందు కోసం 950 కోట్ల రూపాయలకు బ్యాంక్‌ గ్యారంటీ ఇవ్వాలని ఆదేశించింది. ఖాతాల్లో 250 కోట్ల నగదు ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు వివోను ఆదేశించింది. తమ బిజినెస్‌కు ఇబ్బంది లేకుండా సీజ్‌ చేసిన 10 బ్యాంక్‌ అకౌంట్లను రిలీజ్‌ చేయాల్సిందిగా ఈ నెల7న వివో ఈడీ అధికారులను కోరింది. ఈడీ అందుకు అంగీకరించకపోవడంతో కోర్టును ఆశ్రయించింది.

ఈ నెల 5న ఈడీ దేశ వ్యాప్తంగా 48 వివో మొబైల్‌ కార్యాలయలపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. 9 బ్యాంక్‌ల్లోని 10 అకౌంట్లను సీజ్‌ చేశారు. అకౌంట్స్‌ సీజ్‌ చేయడం వల్ల ఉద్యోగులకు వేతనాలు, కార్యాలయాల అద్దెలు, ఇతర చట్టబద్దమైన చెల్లింపులు, రోజు వారి బిజినెస్‌ నిర్వాహణ ఇబ్బందిగా మారిందని వివో తెలిపింది. అకౌంట్స్‌ను ఇలానే సీజ్‌ చేస్తే వివోతో పాటు ప్రభుత్వానికి చెల్లించాల్సినవి ఇతర చెల్లింపులు మొత్తం 451 కోట్లు నష్టం వస్తుందని తెలిపింది.
వివో అభ్యర్ధనను కోర్టు అంగీకరించింది. అకౌంట్ల నిర్వహణకు అనుమతి ఇచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement