Sunday, April 28, 2024

అమృత్‌సర్‌ వద్ద పాక్‌ డ్రోన్‌ను తిప్పికొట్టిన బీఎస్‌ఎఫ్‌

భారత్‌-పాక్‌ సరిహద్దులోని అమృత్‌సర్‌ వద్ద ఓ డ్రోన్‌ భారత్‌ భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించింది. గమనించిన బీఎస్‌ఎఫ్‌ బలగాలు కాల్పులు జరపడంతో డ్రోన్‌ వెనక్కి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగింది. రామదాస్‌ నజదీర్‌ ప్రాంతంలో పాకిస్థాన్‌ డ్రోన్‌ తిరుగుతున్నట్లు అనుమానాస్పదంగా గుర్తించిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు వెంటనే డ్రోన్‌ లక్ష్యంగా 10 రౌండ్ల కాల్పులు జరిపారు.

వెంటనే డ్రోన్‌ పాకిస్థాన్‌లోని బోర్డర్‌ సరిహద్దు ఔట్‌పోస్ట్‌ వైపు వెళ్లింది. ఈ ఘటన 73వ పటాలము సమీపంలోని రామ్‌దాస్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగినట్లు చెప్పారు. పాకిస్థాన్‌ ఔట్‌ పోస్ట్‌ పరిధిలోని పూర్ణా షాపూర్‌కు 2200 మీటర్ల దూరంలోని అంజలా ప్రాంత సరిహద్దులోకి వెళ్లినట్లు బీఎస్‌ఎఫ్‌ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement