Saturday, May 4, 2024

దేశీయ మార్కెట్‌లో 30 శాతం వాటా లక్ష్యం.. ఎయిరిండియా ఐదేళ్ల ప్రణాళిక

టాటా గ్రూప్‌ యాజమాన్యంలోని ఎయిరిండియా వచ్చే ఐదేళ్లకు సమగ్ర పరివర్తన ప్రణాళికను ప్రకటించింది. రాబోయే 60మాసాల్లో దేశీయ మార్కెట్‌లో 30శాతం వాటాను పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. కస్టమర్‌ సేవ, సాంకేతికత, ఉత్పత్తి, విశ్వసనీయత, ఆతిథ్య రంగాలలో మెరుగుదలకు మార్పులను తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ఇందుకోసం ఎయిరిండియా ”విహాన్‌.ఏఐ” పేరుతో సమగ్ర పరివర్తన ప్రణాళికను గురువారం ఆవిష్కరించింది. ”విహాన్‌.ఏఐ” సంస్కృతంలో కొత్తశకం ఆవిర్భావాన్ని సూచిస్తుంది. కస్టమర్‌ ప్రతిపానను పునరుద్ధరించడం, విశ్వసనీయత, సమయానుకూల పనితీరును మెరుగుపరచడంపై దృష్టి సారింతే స్పష్టమైన మైలురాశ్లతో విస్తృతమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది. ప్రాథమిక అంశాలను పరిష్కరించడం, వృద్ధికి క్యారియర్‌ను సిద్ధం చేయడం (ట్యాక్సీయింగ్‌ ఫేజ్‌)పై తక్షణ దృష్టి ఉంటుంది. శ్రేష్ఠత, ప్రపంచ పరిశ్రమలో అగ్రగామిగా మారడానికి కృషి వంటివి మధ్యస్థ-దీర్ఘ్ఘకాల లక్ష్యాలుగా ఉన్నాయని కంపెనీ తెలిపింది.

చారిత్రాత్మక మార్పుకు నాంది

ఇది ఎయిర్‌ ఇండియాలో ఒక చారిత్రాత్మక పరివర్తనకు నాంది అని ఎయిర్‌ ఇండియా ఎండీ, సీఈవో క్యాంప్‌బెల్‌ విల్సన్‌ అన్నారు. ‘మేము ఒక ధైర్యవంతమైన కొత్త ఎయిర్‌ ఇండియా కోసం పునాది వేస్తున్నాము. విహాన్‌.ఏఐ అనేది ఎయిరిండియాను ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా మార్చడానికి పరివర్తన ప్రణాళిక. అంతర్జాతీయ ప్రయాణికులకు సేవలందించే ప్రపంచస్తాయి విమానయాన సంస్థగా గుర్తింపుకోసం పూర్తి దృష్టిసారించామని విల్సన్‌ చెప్పారు. ఎయిర్‌ ఇండియా నవీకరణపై మాట్లాడుతూ క్యాబిన్‌లను పునరుద్ధరించడం, సీట్లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ సిస్టమ్‌ల వంటి రంగాలలో ఇప్పటికే అనేక కార్యక్రమాలతో పరివర్తన ప్రారంభమైందని చెప్పారు. విమానయాన సంస్థ సమయానుకూల పనితీరును మెరుగుపరచడానికి చురుకైన నిర్వహణ, విమాన షెడ్యూల్‌లను మెరుగుపరుస్తుంది. గత వారం ప్రారంభంలో, ఎయిర్‌ ఇండియా ఈ ఏడాది డిసెంబర్‌ నుండి 5 వైడ్‌ బాడీ బోయింగ్‌ విమానాలు, 25 ఎయిర్‌బస్‌ నారో బాడీ ఎయిర్‌క్రాప్ట్‌లతో సహా 30 కొత్త ఎయిర్‌క్రాప్ట్‌లను చేర్చనున్నట్లు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement