Friday, May 3, 2024

Brutal Killings – మ‌హిళా జైలులో మార‌ణ‌కాండ – 41 మంది ఖైదీలు హ‌తం..

హోండురస్ మహిళా జైలులో జ‌రిగిన మార‌ణ‌కాండ‌లో 41 మంది బ‌ల‌య్యారు. ప‌దుల సంఖ్య‌లో గాయ‌ప‌డ్డారు.. మ‌ర‌ణించిన వారిలో 26 మంది మహిళలు అగ్నికి ఆహుతికాగా, మిగతా వారిలో కొందరిని కాల్చి, కత్తితో పోట్ల‌కు గురై మ‌ర‌ణించారు… హోండురస్ రాజధాని టెగుసిగలప్పకు 50 కిలోమీటర్ల దూరంలోని టమారా జైలులో ఈ దారుణం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఏడుగురు ఖైదీలకు టెగుసిగల్ప ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు 41 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు ఫోరెన్సిక్ బృందం తెలిపింది.

హింస తర్వాత జైలు నుంచి పలు తుపాకులు, పెద్దపెద్ద కత్తులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ హింసాకాండపై హోండురస్ అధ్యక్షుడు సియోమరా కాస్ట్రో విచారం వ్యక్తం చేశారు. జైలులో ఆధిపత్యం కలిగిన మరాస్ వీధి ముఠాల పనేనని అన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. బారియో 18 ముఠా జైలులోని ఖైదీల సెల్ బ్లాకుల్లోకి చొరబడి కొందరిని కాల్చి చంప‌డంమే కాకుండా మరికొందరిపై పెట్రోలు పోసి త‌గుల‌బెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement