Monday, May 6, 2024

జులై నుంచి జ‌గ‌న్ సరికొత్త ప‌థ‌కం జ‌గ‌న్న‌న్న సుర‌క్ష కి శ్రీకారం

అమ‌రావ‌తి – సంక్షేమ పథకాల విషయంలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వెనక్కి తగ్గడం లేదు.. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ తాజాగా మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్ట‌నున్నారు. ‘జగనన్న సురక్ష’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు.. ఈ కార్యక్రమాన్ని జులై 1 నుంచి ప్రారంభిస్తారు.. ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందజేయడమే ఈ శిబిరాల లక్ష్యంగా పెట్టుకున్నారు.. తరుచూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా స్పాట్‌లోనే సర్టిఫికేట్స్‌ ఇచ్చే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహించబోతున్నారు.. సచివాయల స్థాయిలోనే సమస్యలను పరిష్కరించి, ప్రతి పౌరుడి ముఖంలో చిరునవ్వు చూడడమే ప్రభుత్వ లక్ష్యం అంటున్నారు.. ఈ క్యాంపు ద్వారా ప్రతి పౌరుడి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయనుంది..

ఈ కార్యక్రమాన్ని మొత్తం 30 రోజుల పాటు నిర్హించనున్నారు.. 15 వేలకు పైగా సురక్షా క్యాంపుల ద్వారా 5.3 కోట్ల మంది పౌరులకు చేరువగా వెళ్లి సమస్యలు పరిష్కరిస్తారు.. ఈ కార్యక్రమంలో 1.5 లక్షల మందికి పైగా సచివాలయ ఉద్యోగులు, మూడు వేలకు పైగా మండల అధికారులు, 26 మంది ప్రత్యేక అధికారులు పాల్గొంటారు.. ఇక, ఇంటింటిని సందర్శించనున్నారు 2.6 లక్షలకు పైగా వాలంటీర్లు, 7.5 లక్షలకు పైగా గృహసారథులు మరియు సచివాలయ కన్వీనర్లు.. 1.6 కోట్ల కుటుంబాలను కలవనున్నారు. మొత్తం 10 రౌండ్స్‌గా శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.. ప్రతీరోజు 1360 క్యాంపులు ఏర్పాటు చేస్తారు.. 75 లక్షల మంది ప్రజల సమస్యలు పరిష్కరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement