Saturday, April 27, 2024

అదానీ అంశంపై వెనక్కి తగ్గని బీఆర్‌ఎస్.. పార్లమెంట్ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి ఎంపీల నినాదాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అదానీ అంశంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలనే డిమాండ్‌పై బీఆర్‌ఎస్ వెనక్కి తగ్గట్లేదు. మంగళవారం ఉదయం లోక్‌సభ వాయిదా పడగానే, బీఆర్‌ఎస్ ఎంపీలు విపక్షాలతో కలిసి జేపీసీ వేసి అదానీని అరెస్ట్ చేయాలని బిగ్గరగా నినాదాలు చేస్తూ పార్లమెంట్ బిల్డింగ్‌లోని ఫస్ట్ ఫ్లోర్ పైకి ఎక్కి ఆందోళనకు దిగారు. రోజువారీ నిరసనకు భిన్నంగా ఎంపీలు పార్లమెంట్ భవన్ ఎక్కి మరీ ఆందోళనకు దిగడం చర్చనీయంగా మారింది.

ఇప్పటికైనా ప్రధాని మోదీ మౌనం వీడాలని బీఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు కోరారు. హిండెన్‌బర్గ్ నివేదికపై ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటున్నారని, కేంద్రం నోరు మెదపకపోవడంతో మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయని చెప్పారు. తాము బాధ్యత గల ప్రతిపక్షంలో ఉన్నందునే ప్రజల పక్షాన నిలబడి ఉద్యమిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా కేంద్రం దిగిరాకపోతే ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని నామ హెచ్చరించారు. ఉభయ సభలను ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తూ విలువైన సమయాన్ని, ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement