Thursday, May 16, 2024

Breaking : విజ‌య‌వాడ‌లో వ్య‌భిచారం గుట్టుర‌ట్టు.. స్పా, మసాజ్‌ ముసుగులో దందా..

విజ‌య‌వాడ‌లో స్పా, మ‌సాజ్ సెంట‌ర్ల ముసుగులో వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్నారు. 131 మ‌సాజ్ సెంట‌ర్ల‌లో పోలీసులు ఆక‌స్మిక దాడులు చేప‌ట్టారు. ఏడు మ‌సాజ్ సెంట‌ర్ల‌లో అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. 90 మ‌సాజ్ సెంట‌ర్లు నిబంధ‌న‌లు గుల్లంఘించి నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. లేబ‌ర్ లైసెన్స్, ఫైర్‌, జీఎస్టీ నిబంధ‌న‌లు యాజ‌మాన్యాలు ఉల్లంఘిస్తున్నాయి. దీంతో 23 మంది మ‌సాజ్ సెంట‌ర్ల నిర్వాహ‌కుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్పా, మ‌సాజ్‌, ఫిట్ నెస్ సెంట‌ర్ల‌ను మూసివేయించారు. వీఎంసీ, క‌మ‌ర్షియ‌ల్ ట్యాక్స్, ఫైర్ సేఫ్టీ అధికారుల‌కు పోలీస్‌ క‌మిష‌న‌ర్ క్రాంతి రాణా లేఖ‌లు రాశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement