Wednesday, May 1, 2024

షారుక్ ఖాన్ 57వ పుట్టినరోజు.. జనసంద్రంగా మారిన మన్నత్ పరిసరాలు

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నేడు తన 57వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. పుట్టిన రోజునాడు షారుక్ ను చూసేందుకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ వచ్చారు.ఈ పుట్టినరోజుకి మంగళవారం అర్ధరాత్రి నుంచే అభిమానులు షారుక్ ఖాన్ ఇంటి వద్దకు బారులు తీరారు. బుధవారం తెల్లవారుజాములోపే మన్నత్ పరిసర ప్రాంతాలు జనసంద్రం అయింది. అభిమానులు బాణాసంచా కాలుస్తూ, అరుపులు, కేరింతలతో షారుక్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. వారి అభిమానాన్ని, ఆప్యాయతల్ని కళ్లారా చూసేందుకు షారుక్.. రాత్రి పూట బయటకు వచ్చారు. తన చిన్న కొడుకు అబ్ రామ్ ను వెంటబెట్టుకొని మన్నత్ బాల్కనీలోకి వచ్చిన ఆయన.. ఫ్యాన్స్ కు అభివాదం చేశారు. చేయి ఊపుతూ, నమస్కారం చెబుతూ వాళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, తన సిగ్నేచర్ స్టయిల్ లో పోజు ఇచ్చి వారిని ఉత్సాహ పరిచారు. బాల్కనీ నుంచి సెల్ఫీ కూడా తీసుకున్నారు. షారుక్ ను చూసిన వెంటనే అక్కడి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement