Wednesday, May 1, 2024

Breaking : క‌ల్యాణ‌మ‌స్తు కార్య‌క్ర‌మం తాత్కాలికంగా ర‌ద్దు-టిటిడి ఈవో ధ‌ర్మారెడ్డి

తిరుమల : కల్యాణమస్తూ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేశామని..త్వరలోనే మరో ముహూర్తంను నిర్ణయించి కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.స్థానిక అన్నమయ్య భవన్ లో టీటీడీ ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాశీ,అయోధ్యలలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం ఇవ్వాలని ప్రభుత్వాని కోరామని..
స్థలం కేటాయిస్తే శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాలు నిర్మిస్తామన్నారు.ఈ నెల 21వ తేదీన నేవీ ముంబాయిలో 8.30 నిమిషాల నుంచి 9.50 గంటల మధ్య శ్రీవారి ఆలయ నిర్మాణానికి శంఖుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని…భూమి పూజ కార్యక్రమాన్నికీ మహారాష్ట్ర సీఎం,ఉప ముఖ్యమంత్రి హాజరవుతారన్నారు.ఆజాదికి అమృతోత్సవంలో భాగంగా ప్రతి టీటీడీ ఉద్యోగి ఇంటి పై జాతీయ జండాను ఎగుర వేయ్యాలని ఆదేశాలు జారీ చేశామని…ప్రతి ఉద్యోగి జాతీయ జండాను ధరించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు.

ఆగష్టు 15వ తేదీన ఉద్యోగులతో తిరుపతిలో గాంధీ విగ్రహం వద్దకు ర్యాలీని నిర్వహిస్తామని…టీటీడీ విద్యాలయాలు,యూనివర్సిటీ,అనుబంధ సంస్థలు,ఆస్పత్రులల్లో వున్న వారు కూడా అజాదికా అమృతోత్సవం వేడుకల్లో పాల్గొనాలని ఆదేశాలు ఇచ్చామన్నారు.భక్తుల సౌకర్యార్ధం తిరుమలలోని అన్ని గదుల్లో గీజర్లు ఏర్పాటు చేస్తామన్నారు.గోవింద రాజ స్వామి ఆలయంలోని అర్చకులు,గదుల వద్ద..క్యూ కాంప్లెక్స్ లలో భక్తుల నుంచి సిబ్బంది డబ్బులు వసూలు చెయ్యడాని తీవ్రంగా పరిగణిస్తున్నా మని..విచారణ జరిపి వీరి పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.తిరుమలలో వసతి సౌకర్యం పెంచే అవకాశం లేదని..తిరుమలలో వసతి కొరత దృష్ట్యా…భక్తులు తిరుపతిలోనే బస చేసి శ్రీవారి దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు.
జూలై నెలలో శ్రీవారికి రికార్డు స్థాయిలో రూ 139.33 కోట్లు హుండీ ఆదాయం లభించిందని..23.40 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారన్నారు.1.07 కోట్ల శ్రీవారి లడ్డూలను విక్రయించామని..53.41 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారన్నారు.10.97 లక్షల మంది భక్తులు స్వామి వారికీ తలనీలాలు సమర్పించారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement