Tuesday, May 7, 2024

Breaking : త‌మిళ స్టార్ విజ‌య్ ఇంట్లో బాంబ్ క‌ల‌క‌లం..మ‌తిస్థిమితం లేని యువ‌కుడి ఫోన్ కాల్..

ఈ మధ్య‌కాలంలో సెల‌బ్రిటీల ఇళ్ల‌కి బాంబు బెదిరింపులు రావ‌డం ప‌రిపాటిగా మారింది. ఈనేప‌థ్యంలో త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ఇంట్లో బాంబు పెట్టిన‌ట్లు చెన్నై నగర పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో నీలంగారైల్లోని… ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు పోలీసులు. నీలంగారై పోలీసులు, బాంబు స్క్వాడ్ కలిసి తనిఖీ చేశారు. అయితే ఈ తనిఖీల్లో బాంబు ఎక్కడ దొరకలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విచారణ లో విల్లుపురం జిల్లా.. మరక్కణం గ్రామానికి చెందిన భువనేశ్వర్ అనే మతిస్థిమితం లేని యువకుడు పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేసినట్లు తెలిసింది. అతను గతంలో కూడా పలువురు రాజకీయ , సినీప్రముఖుల ఇళ్లలో బాంబు ఉన్నట్లు పోలీసులకు ఫోన్ చేశాడని విచారణలో తేలింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement