Sunday, May 5, 2024

నిఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్-వారంలో రూ.60.12కోట్లు

కార్తికేయ2 హీరో నిఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. శ్రీ కృష్ణుడికి సంబంధించిన కథ కావడంతో హిందీ జనాలు ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. అలాగే, బాలీవుడ్ స్టార్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో చిన్న పాత్ర పోషించడం కూడా కలిసి వచ్చింది. తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా దూసుకెళుతోంది. మైథలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది. దాంతో వారం రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 60.12 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. గత వారం విడుదలైన ఈ సినిమాకు కేవలం మౌత్ టాక్ తోనే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. తొలి వారంలో ఆదివారం, పంద్రాగస్టు, కృష్ణాష్టమి సెలవులు ఈ చిత్రానికి కలిసి వచ్చాయి. వీకెండ్లోనే కాకుండా మంగళ, బుధ, గురువారాల్లో కూడా ఈ సినిమాకు మంచి బుకింగ్స్ వచ్చాయి. పైగా, ప్రతీ రోజు థియేటర్ల, షోల సంఖ్య పెరగడం విశేషం. ముఖ్యంగా హిందీలో కేవలం 50 స్ర్కీన్లలో విడుదలైన ఈ చిత్రం వారం తిరిగే సరికి అనూహ్యంగా 3000 స్ర్కీన్లకు పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement