Monday, April 29, 2024

మ‌ల్లారెడ్డా మ‌జాకా- కారు రూఫ్ టాప్ లో నిల‌బ‌డి డ్యాన్స్ చేసిన మంత్రి

కారు రూఫ్ టాప్ లో నిల‌బ‌డి డ్యాన్స్ ని ఇర‌గ‌దీశారు తెలంగాణ కార్మిక‌శాఖ మంత్రి చామ‌కూర మ‌ల్లారెడ్డి.ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ చక్క‌ర్లు కొడుతోంది. వ‌య‌సు మీద ప‌డుతున్నా.. కుర్రాడికి మ‌ల్లే మ‌ల్లారెడ్డి ఈ వీడియోలో స్టెప్పులు వేశారు.మునుగోడు ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో అధికార టీఆర్ఎస్ శ‌నివారం మునుగోడులో ప్ర‌జా దీవెన స‌భ పేరిట భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌భ‌కు రోడ్డు మార్గం మీదుగా సీఎం కేసీఆర్ వేలాది కార్ల‌తో కూడిన భారీ కాన్వాయ్‌తో హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరారు. ఈ ర్యాలీతో మ‌ల్లారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయ‌న త‌న కారు రూఫ్ టాప్‌పై నిల‌బ‌డి డ్యాన్సులేశారు. ఆయ‌న ఎన‌ర్జీకి అంద‌రూ ముగ్థుల‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement