Thursday, May 16, 2024

INDvsWI | భార‌త్ ముందు భారీ టార్గెట్.. ఎంతంటే !

విండీస్ పై మూడో టీ20లో 7 వికెట్ల తేడాతో గెలిచిన భార‌త్ ప్రస్తుతం 1-2తో సిరీస్‌లో వెనుకబి ఉండ‌గా.. ఇవ్వాల జ‌రుగుతున్న నాలుగో టీ20లో ఆత్మవిశ్వసంతో మైదానంలో అడుగుపెట్టింది. ఫ్లోరిడా వేదికగా జరుగుతున్న‌ ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన విండీస్ బ్యాటింగ్ ఎంచుకోగా.. నిర్ణీత 20 ఓవ‌ర్లో 8 వికెట్ల న‌ష్టానికి 178 ప‌రుగులు చేసింది. ఇక, ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ ని స‌మం చేయాల‌ని భావిస్తోంది భార‌త్. మ‌రి ఈ మ్యాచ్ గెల‌వాలంటే నిర్ణీత ఓవ‌ర్ల‌లో 179 ప‌రుగులు చేయాల్సి ఉంది.

ఇక వెస్టిండీస్ బ్యాట‌ర్ల‌లో కైల్ మేయర్స్ 61 ప‌రుగుల‌తో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేయ‌గా… షాయ్ హోప్ 45 ప‌రుగులు చేసి అవుట్ అయ్యాడు. వీర‌ద్ద‌రు మిన‌హా మరే ప్లేయ‌ర్ కూడా 20కి పైగా ప‌రుగులు చేయ‌లేక‌పోయారు.

ఇక భార‌త బౌల‌ర్ల‌లో అర్ష్దీప్ సింగ్ అత్య‌ధికంగా 3వికెట్లు తీయ‌గా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు ద‌క్కించుకున్నాడు. ఇక అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్ చెరో వికెట్ ద‌క్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement