Friday, October 11, 2024

Big Breaking : ఫార్మా పరిశ్రమలో అగ్ని ప్రమాదం… ఎగిసిపడిన మంటలు..

  • కాజిపల్లి పారిశ్రామికవాడలో ఘటన
  • ఫైర్ ఇంజన్ల సాయంతో అదుపులోకి మంటలు
  • ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు… ఆస్ప‌త్రికి తరలింపు

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజిపల్లి పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. లీ ఫార్మా పరిశ్రమలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభ‌వించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగ‌డంతోపాటు ద‌ట్ట‌మైన పొగలు వ్యాపించాయి. ఫార్మా కంపెనీల్లో పెద్ద ఎత్తు కెమికల్స్‌ నిలువ ఉండడంతో మంటల దాటికి కెమికల్స్‌ డ్రమ్స్‌ పేలిపోతున్నాయి. అకస్మాత్తు పరిణామంతో పరిశ్రమలో ప‌ని చేసే కార్మికులు భ‌యంతో బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. ఇద్దరు కార్మికులకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పరిశ్రమ యజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. నాలుగు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఘటనకు సంబంధించి సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement