Friday, April 26, 2024

క్రైమ్ థ్రిల్లర్ గా భూత‌ద్ధం భాస్క‌ర్ నారాయ‌ణ.. టీజ‌ర్ రిలీజ్

భూత‌ద్ధం భాస్క‌ర్ నారాయ‌ణ టీజ‌ర్ రిలీజ్ అయింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించారు.రాశి సింగ్ కథానాయికగా నటించిన చనిపోయిన పదహారు మంది తలలు ఏమైపోయాయన్నది ఎవరికీ తెలియదు. 18 ఏళ్లుగా ఫిర్యాదు చేసినవారు లేరు అనే డైలాగ్ తో ఈ టీజర్ మొదలైంది. ఆ సీరియల్ కిల్లర్ కోసం డిటెక్టివ్ గా హీరో శివ‌ కందుకూరి రంగంలోకి దిగుతాడనే విషయం టీజర్ ద్వారా తెలుస్తుంది.ఈ కేసుకి సంబంధించిన పరిశోధనలో భాగంగా వెళ్లిన హీరో, ఒక ఇంటి దేవుడి గదిలో దిష్టిబొమ్మను చూసి షాక్ అవుతాడు. ఇంతకీ ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? తలలు మాత్రమే అతను ఎందుకు పట్టుకుని వెళుతున్నాడు అనేదే సస్పెన్స్. ఈ సినిమా, మార్చి 31వ తేదీన విడుదల కానుంది.స్నేహాల్ .. శశిధర్ .. కార్తీక్ నిర్మించారు.పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement