Saturday, May 4, 2024

ఓటీటీలో రిలీజ్ కానున్న- కిన్నెర‌సాని

హీరో క‌ళ్యాణ్ దేవ్ న‌టిస్తోన్న చిత్రం కిన్నెర‌సాని..ఈ చిత్రాన్ని డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ చేయ‌నున్నార‌ట‌. సూప‌ర్ మ‌చ్చి’ కంటే ముందే రూపొందిన ఈ చిత్రాన్ని మేక‌ర్స్‌ థియేట‌ర్ రిలీజ్‌కు ప్ర‌య‌త్నించినా కుద‌ర‌లేద‌ని స‌మాచారం. దాంతో ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించార‌ట‌. ఇక ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5లో జూన్ 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి ర‌మ‌ణ‌తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. క‌ళ్యాణ్‌దేవ్‌కు జోడీగా అన్‌శీత‌ల్, కాశీష్‌ఖాన్ హీరోయిన్లుగా న‌టించారు. మ‌హ‌తి స్వ‌రసాగ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎస్ఆర్‌టి ఎంట‌ర్టైన‌మెంట్స్‌, శుభ‌మ్ ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌ల‌పై రామ్ తాళ్ళూరి నిర్మించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement