Wednesday, May 8, 2024

భారీగా తగ్గిన బ్యారెల్ ముడి చమురు ధర..

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర భారీగా తగ్గింది. బ్యారెల్ ముడి చమురు ధర ప్రస్తుతం 66 డాలర్లుగా ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌పై 1.72 డాల‌ర్లు త‌గ్గి 66.51 డాల‌ర్ల‌కు చేరుకున్న‌ది. మే 21 త‌ర్వాత ఇది అతి త‌క్కువ. యూఎస్ వెస్ట్ ఇంట‌ర్మీడియ‌ట్ ధ‌ర 1.96 డాల‌ర్లు త‌గ్గి 63.50 డాల‌ర్ల‌కు ప‌డిపోయింది. అంత‌కుముందు ఇంట్రాడేలో 63.29 డాల‌ర్ల‌కు ప‌డిపోయి త‌ర్వాత పుంజుకున్న‌ది.

గ‌త మే నెల నుంచి ముడి చ‌మురు ధ‌ర త‌గ్గుముఖం ప‌ట్ట‌డం ఇదే తొలిసారి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు పెరుగుతున్నాయ‌న్న ఆందోళ‌న మ‌ధ్య అమెరికా డాల‌ర్ బ‌లోపేత‌మైంది. వ్యాక్సినేష‌న్ త‌క్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో డెల్టా వేరియంట్ క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తున్న‌ద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో వెల్ల‌డించింది. క‌నిపించ‌ని శత్రువుతో పోరాటం ఊహించి దానికంటే ఎక్కువ కాలం పోరాడాల్సి వ‌స్తుంద‌ని పీవీఎం ప్ర‌తినిధి థామ‌స్ వ‌ర్గ చెప్పారు. ఇన్వెస్ట‌ర్లు వాస్త‌విక ద్రుక్ఫ‌థంతో, ఆచితూచి స్పందిస్తున్నార‌న్నారు. ఇది ధ‌ర క్ర‌మంగా త‌గ్గడానికి దారి తీస్తుంద‌న్నారు.

ఇది కూడా చదవండి: ఆఫ్ఘనిస్థాన్ ప్రజలతో చారిత్రక మైత్రి కొనసాగుతుంది: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్

Advertisement

తాజా వార్తలు

Advertisement