Sunday, May 19, 2024

నిల‌క‌డ‌గా మొగిల‌య్య ఆరోగ్యం.. నిమ్స్ డాక్ట‌ర్స్

సింగ‌ర్ మొగిల‌య్య ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఆయ‌న‌కి నిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స జ‌రుగుతోంది. కాగా ఆయ‌న‌కి నిన్న ఛాతి నొప్పి రావడంతో ముందుగా వరంగల్ ఆసుపత్రికి తరలించిన వైద్యులు తాజాగా హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే మొగిలయ్య దీర్ఘకాలికంగా డయాబెటీస్, బీపీ సమస్యలతో బాధపడుతున్నారు. గత ఏడాది ఆయనకు రెండు కిడ్నీలు చెడిపోవడంతో అప్పటి నుంచి డయాలసిస్ తోనే నడిపిస్తున్నారు . ప్రస్తుతం మొగిలయ్యకు అన్ని పరీక్షలు చేసిన తర్వాత గుండె సమస్య లేదని నిమ్స్ వైద్యులు నిర్ధారించారు. డయాలిసిస్ కొనసాగిస్తూనే చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం మొగిలయ్య ఆరోగ్యం నిలకడగానే ఉందని..ఆహారం కూడా తీసుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. కాగా మొగిల‌య్యల‌కి అందించే చికిత్స అంతా ఉచిత‌మే..ఈ మేర‌కు మంత్రి హ‌రీశ్ రావు హామీ ఇచ్చారు.క‌మెడియ‌న్ వేణు ద‌ర్శ‌కుడిగా మారి తెర‌కెక్కించిన చిత్రం బలగం.ఈ చిత్రంలో పాట పాడారు మొగిల‌య్య‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement