Wednesday, May 15, 2024

పాట్నా ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు..

బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలోని ఎయిర్‌పోర్టులో బాంబుపెట్టినట్లు ఈ మధ్యాహ్నం అక్కడి పోలీసులకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, ఎయిర్‌పోర్టు అధికారులు వెంటనే బాంబ్‌ స్క్వాడ్‌ ను రంగంలోకి దించారు. హుటాహుటిన ఎయిర్‌పోర్టుకు చేరుకున్న బాంబ్‌ స్క్వాడ్‌ పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నది. ఎయిర్‌పోర్టు లోపల, బయట, పార్కింగ్‌ ఏరియాలో అణువణువు గాలిస్తున్నారు. అయితే ఇప్పటివరకు బాంబు ఉన్నట్లు ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. బాంబ్‌ స్క్వాడ్‌ సెర్చింగ్‌ ఇంకా కొనసాగుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement