Tuesday, May 14, 2024

పట్ట పగలే పాడు పని.. లవర్స్ అరెస్ట్ ..బైక్ సీజ్

అచ్చు సినిమాలో తీరుగా బైక్ ని నడిపాడు ఓ యువకుడు..ఇందులో కొత్తేమి ఉంది అనుకోకండి. బైక్ ట్యాంక్ పై అసభ్యకర రీతిలో అమ్మాయిని కూర్చొపెట్టుకుని ముద్దుల్లో మునిగితేలాడు.. పట్టపగలే రయ్.. రయ్‌మంటూ దూసుకుపోయారు. పబ్లిక్‌గా వీరు చేస్తోన్న ఈ పాడు పని అటుగా ఓ కారులో వెళ్తున్న వ్యక్తులు వీడియోని తీశారు. ఈ ఘటన విశాఖపట్నంలోని ప్రధాని రహదారిపై చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది నెట్టింట చక్కర్లు కొట్టిన రెండు గంటలలోపే సదరు ద్విచక్ర వాహనం నడిపిన యువకుడు, యువతిని స్టీల్‌ప్లాంట్ పోలీసులు అదుపులోకి తీసుకుని.. ఇరువురిపై కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. అనంతరం వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. వారిద్దరూ గాజువాక సమీప వెంపలినగర్‌, సమతానగర్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కాగా, ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా వారి వాహనాలను సీజ్ చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ సి.హెచ్ శ్రీకాంత్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement