Friday, December 1, 2023

బాప‌ట్ల జిల్లాలో ఘోరం.. రైలు కింద‌ప‌డి వీఆర్వో ఆత్మ‌హ‌త్య‌

బాపట్ల జిల్లాలోని కారంచేడు మండలంలో వీఆర్వో రైలు కింద‌ ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డింది. కారంచేడు మండ‌లం కుంకల మర్రు గ్రామానికి చెందిన సీహెచ్‌ నాగమణి.. పర్చూరు మండలం గొల్లపూడిలో వీఆర్వోగా పనిచేస్తుంది. శుక్రవారం ఆమె చీరాల స్టేషన్‌ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. వెంట‌నే స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఆత్మ‌హ‌త్య ఎందుకు చేసుకుంది? కుటుంబ స‌మ‌స్య‌లా? అరే ఇత‌ర ఒత్తిళ్ల కార‌ణ‌మా అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement