Sunday, December 4, 2022

జగన్‌ పాలనలో వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు అన్యాయం : టీడీపీ అధినేత చంద్ర‌బాబు

కర్నూలు : టీజీ భరత్ ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో రెండు వేల మంది వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. ఈ సంద‌ర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వైసీపీలో గుర్తింపు లేక‌, అన్యాయాలు చూడ‌లేక వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు టీడీపీలో చేరుతున్నార‌న్నారు. 50 శాతం వెనుక బడిన వర్గాలకు జగన్ పాలనలో అన్యాయం జరుగుతోంద‌న్నారు. ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియా జరుగుతున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవడం లేద‌న్నారు. వైసీపీ నేతలు దోపిడీ దొంగలుగా మారి దోచుకుంటున్నారు త‌ప్ప‌.. రాష్ట్రాభివృద్ధికి, ప్ర‌జ‌ల‌కు చేసిందేమీ లేద‌న్నారు. సైకో జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసి, మూడు రాజధానులు అంటూ డ్రామా మొదలు పెట్టాడు అని మండిప‌డ్డారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement