Saturday, May 4, 2024

రంజిత‌మే సాంగ్ కి క‌డుపులో బిడ్డ క‌ద‌లిక‌లు.. వైర‌ల్ గా వీడియో

రంజిత‌మే సాంగ్ కి సంబంధించి ఓ క్రేజీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రంజితమే పాటకు పుట్టబోయే బిడ్డ కూడా గెంతులు వేస్తోంది..వారిసు’లోని ‘రంజితమే’ పాట తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకంగా నిలిచిందని పేర్కొంటూ తమిళనాడుకు చెందిన ఓ ఫ్యామిలీ స్పెషల్ వీడియో షేర్‌ చేసింది. ఇందులో ఓ మహిళ బేబీ బంప్‌తో నవ్వులు చిందిస్తూ కనిపించింది. ‘రంజితమే’ పాటను ప్లే చేయగా ఆమె కడుపులోని బిడ్డ గెంతులేస్తున్నట్లు కదలికలు కనిపిస్తున్నాయి. రంజితమే పెట్టిన ప్రతిసారీ బేబీ ఇలాగే డ్యాన్స్‌ చేస్తోంది అంటూ ఆమె మురిసిపోయింది. ఈ వీడియోపై చిత్ర సంగీత దర్శకుడు తమన్‌ స్పందిస్తూ.. ఈ వీడియో చూస్తుంటే మధురానుభూతికి లోనవుతున్నాను. నా రోజును ఇది ఎంతో సంతోషంగా మార్చేసింద‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement