Sunday, May 5, 2024

Avatar | అవ‌తార్ అభిమానుల‌కు జేమ్స్​ మామ షాక్.. మూవీ రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్

దర్శకుడు జేమ్స్ కేమరూన్ తెరకెక్కించిన ఎన్నో సెన్సేషనల్ విజువల్ అండ్ బాక్సాఫీస్ వండర్ సినిమాల‌లో ‘అవతార్” ఒకటి. ఇక అవ‌తార్ సీక్వెల్ గా గత ఏడాది రిలీజ్ అయిన‌ అవతార్ 2.. బాక్సాఫీస్ వ‌ద్ద‌ 2 బిలియన్ కన్నా ఎక్కువ వసూళ్లు రాబట్టి సెన్సెష‌నల్ హిట్ గా నిలిచింది. ఇక‌ ఈ సినిమా హిట్ తో అవతార్ సినిమాకి మ‌రిన్ని సీక్వెల్స్ రాబోతున్నాయ‌ని. కన్ఫర్మ్ చేసి.. అందులోని మూడు సినిమాల‌ రిలీజ్ డేట్ లు కూడా చెప్పేశాడు కేమరూన్..

అయితే.. ఇపుడు ఊహించని విధంగా ఈ మొత్తం మూడు సీక్వెల్స్ తాలూకా డేట్స్ వాయిదా పడినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. దీంతో అవ‌తార్ సిరీస్ లైన‌ప్ రిలీజ్ డేట్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి. ఇక వరసగా మూడు సినిమాల కొత్త డేట్స్ చూస్తే అవతార్ 3, 2025 డిసెంబర్ 19, అలాగే అవతార్ 4 డిసెంబర్ 21, 2029 అలాగే అవతార్ 5 చిత్రం అయితే ఏకంగా 2031 డిసెంబర్ 19న రిలీజ్ చేస్తున్నట్టుగా డిస్నీ వారు కన్ఫర్మ్ చేశారు. దీంతో ఈ సెన్సేషనల్ ఫ్రాంచైజ్ కొత్త డేట్స్ ఇప్పుడు వరల్డ్ సినిమా దగ్గర వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement