Thursday, May 9, 2024

Spl Story | ఐఓఎస్​ 17లో సైడ్​లోడింగ్​ రూమర్స్​!.. అసలు నిజం ఏమిటి?

ఆపిల్​ ఐఫోన్లలో త్వరలోనే కొత్త ఆపరేటింగ్​ సిస్టమ్​ రాబోతోంది. ఇప్పటివరకు ఐఓఎస్​ 16.6 వాడుతున్న యూజర్లకు త్వరలోనే iOS 17 అప్​డేట్స్​ రానున్నాయి. అయితే ఆండ్రాయిడ్​ ఫోన్లకంటే ఆపిల్​ ఫోన్లు చాలా ప్రైవసీ, డేటా సేఫ్టీ ఉంటుందని యూజర్స్​ భావిస్తుంటారు. కాగా, ఈ కొత్త వర్షన్​లో సైడ్‌లోడింగ్‌ అంశంపై Apple వైఖరి ఆసక్తికరంగా మారింది. దీనిపై పలురకాల పుకార్లు మొదలయ్యాయి. ఆపిల్ ఐఓఎస్​17 లో సైడ్‌లోడింగ్‌ను అనుమతించే అవకాశాన్ని సూచించినప్పటికీ, ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.  యూజర్స్​ ప్రైవసీనే తమకు ఇంపార్టెంట్​ అని ఆపిల్ సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్రెగ్ ఫెడ్రిగే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

వరల్డ్​ వైడ్​ డెవలపర్​ కాన్ఫరెన్స్​ (WWDC) 2023కి ముందు iOS 17లో సైడ్‌లోడింగ్‌ ఆప్స్​కి సంబంధించిన అంశాలుంటాయని చాలామంది అనుకున్నారు. యూరోపియన్ యూనియన్ దేశాలలో ఆపిల్​ సైడ్‌లోడింగ్‌ను ప్రారంభించవచ్చని కొన్ని నివేదికలు సూచించాయి. అంతేకాకుండా 9to5Mac iOS 16లో ఉపయోగించని కోడ్‌ని కనుగొనడం ద్వారా ఈ నివేదిక నిజమేనన్న ధ్రువీకరణకు చాలామంది వచ్చారు. అయితే.. ఇది యూజర్​ లొకేషన్​​ని కనుగోనేలా ఈ కొత్త ఫీచర్‌ ఉందనే అనుమానాలున్నాయి. ఆశ్చర్యకరంగా WWDC 2023 కీనోట్ సమయంలో Apple సైడ్‌లోడింగ్ అంశాన్ని ప్రస్తావించలేదు. కానీ, ఇప్పుడు ఆ ప్రణాళికల గురించి చాలా మంది ఆసక్తిగా వెయిట్​ చేస్తున్నారు.

ప్రస్తుత iOS 17 బీటా వెర్షన్ సైడ్‌లోడింగ్‌కు సపోర్టు చేయదు. సైడ్‌లోడింగ్‌పై ఐరోపా సమాఖ్య తీర్పులతో ఆపిల్ తనను తాను సర్దుబాటు చేసుకోవచ్చని ఆపిల్​ సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​, వైస్​ ప్రెసిడెంట్​ క్రెయిగ్ ఫెడ్రిగే సూచించారు. కస్టమర్ సంతృప్తి, భద్రతపై కంపెనీ దృష్టి ఉంటుందని ఆయన మరింత స్పష్టంగా చెప్పారు. ఏదైనా కొత్త చట్టాలకు అనుగుణంగా ఉండేలా EUతో కొనసాగుతున్న చర్చలను ఫెడ్రిగే అంగీకరించారు.

- Advertisement -

iOS 17 Sideloading Controversy..

iOS, Android ప్లాట్‌ఫారమ్‌ మధ్య చాలా స్పష్టమైన తేడాలున్నాయి. అదేమాదిరిగా Apple చాలా కాలంగా యూజర్స్​ ప్రైవసీకి, సేఫ్టీకి ప్రాధాన్యమిస్తోంది. ముఖ్యంగా MacOS, Apple వంటి వాటితోపాటు డెస్క్ టాప్ ఆపరేటింగ్ సిస్టమ్, Windows, Linux ఆపరేటింగ్ సిస్టమ్‌కు సమానమైన వివిధ వనరుల నుండి థర్డ్​ పార్టీ యాప్స్​ని ఇన్‌స్టాల్ చేయడానికి అనుమతించడు. దీనికి విరుద్ధంగా ఆండ్రాయిడ్ ప్లాట్​ఫామ్​  సైడ్‌లోడింగ్ సామర్థ్యాలను అందిస్తుంది.  ప్రధానంగా థర్డ్-పార్టీ స్టోర్‌ల నుండి యాప్‌లను ఇన్‌స్టాల్ చేసే సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వినియోగదారులచే ఉపయోగించబడుతుంది. ఇక.. హానికరమైన సాఫ్ట్ వేర్‌ను గుర్తించడం, తీసివేయడం ద్వారా యూజర్లను రక్షించడం వంటి చర్యలను Google Play Protect సరిచేస్తుంది.  

ఇక.. 9to5Mac తెలిపినట్టు సైడ్‌లోడింగ్ పై Apple విముఖత చూపుతున్నట్టు స్పష్టమవుతోంది. దీంతో యాప్ స్టోర్ ద్వారా వచ్చే గణనీయమైన రాబడి మీద ఎఫెక్ట్​ పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ డెవలపర్‌లు ఒక్కో విక్రయానికి 30 శాతం వరకు రుసుము చెల్లిస్తారు. యాప్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌లను ఈ ఫీచర్ క్లిష్టతరం చేసే అవకాశం ఉన్నందున సాధారణ వినియోగదారులకు యాక్సెసిబిలిటీని కొనసాగించాలనే కోరిక కారణంగా సైడ్‌లోడింగ్‌ను Apple తప్పించుకోవడం కూడా చూడొచ్చు. కాబట్టి Apple వినియోగదారు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం, యాప్ స్టోర్ నుండి వచ్చే ఆదాయ ప్రవాహాల గురించిన ఆందోళనలు సైడ్‌లోడింగ్‌కు అనుమతించడానికి దోహదపడవచ్చు. వీటన్నిటి మధ్య త్వరలో రిలీజ్​ కాబోతున్న iOS 17కు సంబంధించిన సైడ్‌లోడింగ్ గురించి మరిన్ని అప్‌డేట్‌లు, వివరణల కోసం వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement