Sunday, May 5, 2024

40% Sarkara | 40శాతం కమిషన్​ సీఎం యాడ్​ ఎఫెక్ట్​.. రాహుల్​ గాంధీకి కర్నాటక కోర్టు సమన్లు

‘40శాతం కమిషన్​ సర్కారు’ పేరుతో కర్నాటకలో కాంగ్రెస్​ పార్టీ చేసిన ప్రచారంపై బీజేపీ పరువునష్టం దావా వేసింది. ఎన్నికైన మాజీ, సిట్టింగ్​ ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన క్రిమినల్​ కేసులను పరిష్కరించే ప్రత్యేక న్యాయస్థానంలో ఈ పిటిషన్​ దాఖలైంది. ఐపీసీ 499, 500 సెక్షనలు వర్తింపజేస్తూ పరువు నష్టం కింద పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ కర్నాటక రాష్ట్ర కార్యదర్శి ఎస్​ కేశవప్రసాద్​ మే 9న ప్రైవేట్​ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ, కర్నాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ)పై అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో బీజేపీ పరువునష్టం ఫిర్యాదును దాఖలు చేసింది.

ఈ కంప్లెయింట్​ ప్రకారం.. ఈ ఏడాది మే 5వ తేదీన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాన వార్తాపత్రికలలో KPCC విడుదల చేసిన ప్రకటనను ప్రస్తావించారు. అప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 40 శాతం అవినీతికి పాల్పడిందని, నాలుగేండ్లలో రూ. 1.5 లక్షల కోట్లు కొల్లగొట్టిందని ఆ యాడ్​లో పేర్కొన్నట్టు తెలిపింది. ఈ అడ్వర్టైజ్​మెంట్​ బీజేపీ ప్రతిష్టను దిగజార్చేలా, ప్రకటనల్లో తప్పుడు వాదనలు ఉన్నాయని బీజేపీ నేత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రతివాదులందరికీ కోర్టు సమన్లు ​​జారీ చేయాలని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement