Tuesday, May 7, 2024

Ashes 2023 | యాషెస్ రెండో టెస్ట్ లో ఇంగ్లండ్ పై 43 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం

లార్డ్స్ వేదికగా జరిగిన యాషెస్ రెండో టెస్టులో ఇంగ్లండ్ పై 43 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి ఆసీస్ దూసుకెళ్లింది. 371 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 327 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(155) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. తన జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. 114/4 వద్ద ఐదో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఇంగ్లడ్ జట్టు అదనంగా మరో 213 పరుగులు చేసి ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో స్టోక్స్ తో పాటు బెన్ డకెట్ (83) రాణించారు.

ఇక ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్, హాజిలవ్వుడ్, మిచెల్ స్టార్క్ తలా: 3 వికెట్లు సాధించగా.. గ్రీన్ ఒక్క వికెట్ పడగొట్టాడు. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులకి ఆలౌట్ కాగా ఇంగ్లండ్ 325 ప‌రుగులకి ఆలౌట్ అయ్యింది.. అనంతరం తొలి ఇన్నింగ్స్లో 91 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న ఆస్ట్రేలియా, రెండో ఇన్నింగ్స్ 279 పరుగులకి ఆలౌట్ అయ్యింది. దీంతో ఇంగ్లండ్ ముందు 371 లక్ష్యాన్ని ఆసీస్ ఉంచింది. ఇక ఇరు జట్లు మధ్య మూడో టెస్టు జూలై 6 నుంచి లీడ్స్ వేదికగా జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement