Sunday, April 28, 2024

Latest | ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లేటెస్ట్ అప్‌డేట్.. నెక్స్ట్ షెడ్యూల్ వివ‌రాలు వెల్ల‌డించిన మేక‌ర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకులు, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాకి సంబందించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ తాజాగా వెల్లడించారు.

ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబందించిన నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు మేకర్స్ సరికొత్త పోస్టర్ల ద్వారా వెల్లడించారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర లో బిజీగా ఉంటూనే, షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement