Tuesday, April 30, 2024

రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజులపాటు వర్షాలు.. ప‌లు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రానున్న నాలుగు రోజులపాటు పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడా అతి భారీ వర్షాలు నమోదు కావొచ్చని తెలిపింది. ఈ నెల 4 నుంచి 6 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 5న ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, నాగర్‌కర్నూలు, జోగులాంబ గద్వాల జిల్లాల్‌ఓ అక్కడక్కడ భీరా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

6న ఆదిలాబాద్‌, కొమరంభీం ఆసీఫాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నాగర్‌కర్నూలు, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు పసుపు రంగు (ఎల్లో అలర్ట్‌ ) హెచ్చరికలను జారీ చేసింది.

ఈ ఏడాది జూన్‌ 22న ఆలస్యంగా నైరుతి ప్రవేశించినా ఇప్పటి వరకు చెప్పుకోదగిన వర్షాలు కురవకపోవడంతో వ్యవసాయంపై రైతులు బెంగపెట్టుకున్నారు. జూన్‌ నెలలో 12.5 సె.మీ వర్షపాతం కురవాల్సి ఉన్నప్పటికీ 50శాతం కంటే తక్కువగా కేవలం 5.5 శాతం వర్షపాతం మాత్రమే నమోదయింది. అయితే జులైలో రాష్ట్ర వ్యాప్తంగా వానలు జోరందుకుంటాయని వాతావరణశాఖ వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల కదలికలు చురుకుగా ఉన్నాయని, ఈ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జులై నెలలో తెలంగాణలో సాధారణం 24.44 సెం.మీ కంటే 10శాతం అధికంగా వర్షాలు కురుస్తాయని రైతులకు తీపికబురు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement