Thursday, May 2, 2024

మాజోలికొస్తే ప్రపంచానికే చేటు.. నాటోకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరిక

నాటో దళాలు గనుక రష్యా సైన్యంతో నేరుగా ఘర్షణకు దిగితే, అది ప్రపంచ విపత్తుకు దారితీస్తుందని వ్లాదిమిర్‌ పుతిన్‌ హెచ్చరించారు. కజకిస్తాన్‌ రాజధాని ఆస్తానాలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏదేమైనప్పటికీ, రష్యా సైన్యంతో నాటో దళాల ప్రత్యక్ష ఘర్షణ చాలా ప్రమాదకరమైన చర్య. ఇది ప్రపంచ విపత్తుకు దారితీస్తుందని నేను భావిస్తున్నాను. నాటో అలాంటి దుందుడుకు చర్య తీసుకోకుండా ఉండటమే తెలివైన పని అని సూటిగా చెప్పారు. గతనెలలో ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తర్వాత, అవసరమైతే అణ్వాయుధాలు ఉపయోగిస్తానని పుతిన్‌ హెచ్చరించాడు. ఈ చర్యను గతవారం ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది.

రష్యా హద్దుమీరితే తీవ్ర పరిణామాలు ఉంటాయని జీ7 దేశాలు మంగళవారం హెచ్చరించాయని వైట్‌హౌస్‌ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ప్రపంచశాంతి, భద్రతలను పెంపొందించే రిజర్విస్టుల (సైన్యం) పాక్షిక సమీకరణ, బాధ్యతారాహిత్యమైన అణు వాక్చాతుర్యంతో సహా ఉద్దేశపూర్వక ఉద్రిక్తతలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అంటూ జీ7 దేశాధినేతలు ప్రకటించారు. అంతకు ముందు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ తన ప్రసంగంలో ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం తీవ్రతరం కావడం గురించి చేసిన హెచ్చరికలో ఆర్మగెడాన్‌ గురించి మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement