Friday, May 3, 2024

గ‌ల్లా అశోక్ ఈసారి ర‌ఫ్ లుక్ లో….

‘హీరో’ చిత్రంతో సినీ అరంగేట్రం చేసిన సూపర్‌ స్టార్‌ మహే ష్‌ బాబు మేనల్లుడు, యంగ్‌ హీరో అశోక్‌ గల్లా తన రెండవ సినిమాకు శ్రీకారం చుట్టారు. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ కథ అందించారు. ‘గుణ 369’ ఫేమ్‌ అర్జున్‌ జంధ్యాల దర్శక త్వం వహిస్తున్నారు. సోమినేని బాల కృష్ణ నిర్మిస్తున్నారు. కె సాగర్‌ సహ నిర్మాత.
ఈ సినిమా వైభవంగా మొద లైంది. ముహూర్తం షాట్‌కు వెంకటేష్‌ క్లాప్‌ కొట్టగా, నమ్రత శిరోద్కర్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ఆది శేషగిరిరావు, బివిఎస్‌ రవి, గల్లా జయ దేవ్‌ తది తరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


బుర్రా సాయిమాధవ్‌ సంభాష ణలు అందిస్తున్నారు. భీమ్స్‌ సిసిరోలి యో సంగీతం అందిస్తుండగా, ప్రము ఖ సినిమాటోగ్రఫర్‌ ప్రసాద్‌ మూరెళ్ల కెమరామెన్‌ గా, తమ్మిరాజు ఎడిటర్‌ గా పని చేస్తున్నారు.
అశోక్‌ గల్లా మాట్లాడుతూ ” నేను సాప్ట్‌ గా ఉంటానని అంటారు. ఈ సినిమాతో నన్ను అందరూ రఫ్‌ లుక్‌ లో కూడా ఆదరిస్తారని నమ్ముతున్నా ను. ” అన్నారు.
అర్జున్‌ జంధ్యాల మాట్లాడుతూ. .”మంచి కథ. అంతే చక్కని చిత్రీక రణతో ప్రేక్షకుల ముందుకు వస్తాం. నిర్మాత బాలకృష్ణ గారు నాకు ఎప్పటి నుంచో నాకు స్నేహితులు. సినిమా పట్ల చాలా ప్యాషన్‌ ఉన్న నిర్మాత. ఆయన మొదటి సినిమాకి నేనే దర్శ కుడు కావడం, ప్రశాంత్‌ వర్మ గారు కథ ఇవ్వడం.. ఇవన్నీ అద్భుతంగా కుదిరాయి” అన్నారు.
బుర్రా సాయిమాధవ్‌ మాట్లాడు తూ ”అర్జున్‌ జంధ్యాల చాలా క్లారిటీ- విజన్‌ వున్న దర్శకుడు. హీరో సినిమా చూసినప్పుడే అశోక్‌ తో ఎలాంటి పాత్ర-కై-న సరిపోతాడని అనిపించింది.” అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement