Tuesday, March 21, 2023

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు ఏర్పాట్లు షురూ.. ఈ నెల 26న కాందేర్‌ లోహాలో బహిరంగ సభ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మహారాష్ట్రలో ఈ నెల 26న జరగబోయే బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ ఏర్పాట్లు ప్రారంభించారు. కాందార్‌ లోహాలో నిర్వహించనున్న సభకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి పనులను మొదలు పెట్టారు. సభ ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడనున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ హాజరుకానున్న ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో నేతలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు.

- Advertisement -
   

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షకీల్‌, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ బాలమల్లు, బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ జనరల్‌ సెక్రటరీ హిమాన్షు తివారి, మహారాష్ట్ర సెల్‌ అధ్యక్షులు మాణిక్‌ కదం ప్రవీణ్‌, నేతలు రాఘవ, అమృత్‌ లాల్‌ చౌహాన్‌, శివాన్క్‌, అంకిత్‌ యాదవ్‌, గణేష్‌ బాబుతో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement