Saturday, May 18, 2024

ఎల్​ఏసీ ప్రాంతంలో ఆర్మీ చీఫ్​ పర్యటన.. మూడ్రోజుల పర్యటనలో జనరల్​ మనోజ్​ పాండే

భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి ఉన్న ఫార్వర్డ్ ప్రాంతాల్లో మూడు రోజుల పర్యటించనున్నారు. భారత ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఈ ప్రాంతాలను సందర్శించడం ఇదే తొలిసారి.  ఈ పర్యటన సందర్భంగా సరిహద్దుల వెంబడి నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను స్థానిక కమాండర్లు జనరల్ మనోజ్ పాండేకు వివరించారు. పర్వతారోహణ నైపుణ్యాలు, సుదూర శ్రేణి పెట్రోలింగ్‌తో సహా మోహరించిన బలగాల తీరు.. అధిక ఎత్తులో పనిచేయడం వంటి సామర్థ్యాలపై కూడా ఆర్మీ చీఫ్ పరిశీలించనున్నారు.కాగా, కొనసాగుతున్న మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులను, ఫార్వర్డ్ ప్రాంతాలలో సైన్యం, పౌరుల మధ్య సంబంధాన్ని కూడా ఈ సందర్భంగా సమీక్షించనున్నారు.

ఇక.. జనరల్ మనోజ్ పాండే సరిహద్దు వెంబడి అప్రమత్తత.. దానికి సంబంధించిన అవసరాన్ని భారత బలగాలకు నొక్కిచెప్పారు. నిర్మాణాల కార్యాచరణ సంసిద్ధతను వేగంగా మెరుగుపరచడంపై తన సంతృప్తిని వ్యక్తం చేశారు. నిరంతర నిఘా చేపట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని ప్రశంసించారు. ఫార్వర్డ్ పోస్ట్ లలో మోహరించిన దళాలను వృత్తిపరమైన నైపుణ్యం యొక్క ఉన్నత ప్రమాణాలను కొనసాగించాలని సూచించారు. వారి ధైర్య సాహసాలను ప్రశంసించారు. సరిహద్దు ప్రాంతాల్లో కార్యాచరణ ప్రభావం, సుస్థిర అభివృద్ధికి సైన్యం, CAPF, సివిల్ అడ్మినిస్ట్రేషన్, పోలీసుల మధ్య అద్భుతమైన సమన్వయాన్ని కూడా జనరల్​ పాండే అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement