Saturday, April 27, 2024

మరో 2391 పోస్టుల భర్తీకి ఆమోదం.. త్వరత్వరగా నియామక ప్రక్రియ

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌ : రాష్ట్రంలో మరో 2391 పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ ఉద్యోగాల భర్తీని టీఎస్‌పీఎస్సీ, గురుకుల విద్యాలయాల నియామక సంస్థల ద్వారా చేపట్టనున్నారు. ఆయా పోస్టుల భర్తీకి ఆర్ధికశాఖ అనుమతులిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ గురుకులాల్లో 153 జూనియర్‌ అసిస్టెంట్లు, 417 జూనియర్‌ లెక్చరర్లు, గురుకులాల్లో 87 టీజీటీ పోస్టులు, సమాచార-పౌరసంబంధాల శాఖలో 166 పోస్టులు, బీసి గురుకులాల్లో 1499 పోస్టులు, 480 డిగ్రీ కళాశాల లెక్చరర్ల పోస్టులు, 185 జూనియర్‌ కాలేజీ లెర్చరర్లు, 235 పీజీటి, 324 టిజిటి, బీసి గురుకులాల్లో 63 స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ అనుమతించింది.

విభాగాల వారీగా…

  • అసిస్టెంట్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్లు 16
  • ఉర్దూ ఎడిటర్‌ 1
  • ఇన్ఫర్మేషన్‌ టెక్నీషియన్స్‌ 22
  • పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ 4
  • పబ్లిసిటీ అసిస్టెంట్‌ 82
  • స్కూల్‌ ప్రిన్సిపాల్‌ పోస్టులు 10
  • డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు 480
  • జూనియర్‌ కాలేజీ లెక్చరర్లు 185
  • పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు 235
  • టీజీటీ 324
  • లైబ్రరేరియన్‌ 11
  • డిగ్రీ కాలేజీ లైబ్రరేరియన్‌ 37
  • స్కూల్‌ లైబ్రరేరియన్‌ 11
  • డిగ్రీ కాలేజీ ఫిజికల్‌ డైరెక్టర్‌ 20
  • స్కూల్‌ పీఈటి 33
  • ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌ 33
  • డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్‌ లైబ్రరేరియన్‌ 15
  • ల్యాబ్‌ అసిస్టెంట్‌ 60
  • కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌ 30
  • స్టోర్‌ కీపర్‌ 15
  • అసిస్టెంట్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజనీర్‌ 41

రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఒకవైపు, పరీక్షలు, నియాక ప్రక్రియ, ఆర్ధిక వాఖ అనుమతులు మరోవైపు చకచకా ముందుకు సాగుతున్నాయి. 80వేల ఉద్యోగ భర్తీ ప్రక్రియ చురుగ్గా పురోగతిలో సాగుతోంది. ఎన్నికల ఏడాది కావడంతో సత్వర ఉద్యోగ భర్తీ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తొమ్మిదినెలల కాలంలో దాదాపు 25 నోటిఫికస్త్సన్లతో ప్రభుత్వం ఉద్యోగ భర్తీ పురోగమనంలో రికార్డు సాధించింది. నిరుద్యోగులకు అండగా నిలుస్తూ ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యతనిస్తోంది. నెలకు సఘటున 3 ప్రకటనల చొప్పున వెలువరిస్తోంది. టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే 80శాతం భర్తీ ప్రక్రియ పూర్తిచేయగా, మిగతా నియామక సంస్థలు అంతే వేగంగా నోటిఫికేషన్ల జారీతో వేగం పెంచాయి. గ్రూప్‌-4 9168 పోస్టులతోపాటు, గ్రూప్‌-1 పోస్టులకు సంబంధించి అర్హుఏల జాబితా వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement