Sunday, April 28, 2024

ఏపీలో ఆంక్షలు కఠినం

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అంధ్రప్రదేశ్ లోనూ కనిపిస్తోంది. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య మరింత పెరుగుతుండడమే అందుకు నిదర్శనం. నిన్న దాదాపుగా వెయ్యి వరకు కేసులు నమోదయ్యాయి.  ఏపీలో కేసులు విజృంభిస్తుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి కొవిడ్ నిబంధనలు అమలు చేయనుంది. పాజిటివ్ నిర్ధారణ కోసం ఆర్టిపీసీఆర్ టెస్టులను నిర్వహించబోతున్నారు.  కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ఏర్పాటు చేయాలని, ఇంటింటి సర్వే నిర్వహించి పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్ లో ఉన్నవారు 14  రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.  మాస్క్, భౌతికదూరం, మాస్క్ తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆదేశించింది.

కాగా, నిన్న 40,604 కరోనా పరీక్షలు నిర్వహించగా 984 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 176 మందికి పాజిటివ్ అని నిర్ధారణ కాగా, విశాఖ జిల్లాలో 170, చిత్తూరు జిల్లాలో 163 కొత్త కేసులు వెల్లడయ్యాయి. కృష్ణా జిల్లాలో 110, నెల్లూరు జిల్లాలో 89 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 306 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, ఇద్దరు మరణించారు. కరోనా వల్ల ఇప్పటి వరకు 7,203 మంది మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement