Sunday, May 5, 2024

సింధు ఖాతాలో మరో టైటిల్.. సింగపూర్​ ఓపెన్​ విజేతగా సింధు

తెలుగు తేజం, భార‌త బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు మ‌రో టైటిల్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. సింగ‌పూర్ ఓపెన్ టైటిల్ ఫైన‌ల్ నెగ్గిన సింధు.. సింగ‌పూర్ ఓపెన్ విజేత‌గా నిలిచింది. ఆదివారం ఉద‌యం జ‌రిగిన టైటిల్ పోరులో ఆమె చైనాకు చెందిన వ్యాంగ్ జీ ఈని మ‌ట్టి క‌రిపించి విజేత‌గా నిలిచింది. 21-9, 11-21, 21-15 స్కోరుతో సింధూ ఫైనల్‌లో విజ‌యం సాధించింది. ఈ ఏడాదిలో ఇప్ప‌టికే రెండు టైటిళ్లు నెగ్గిన పీవీ సింధు.. తాజాగా సింగ‌పూర్ ఓపెన్ టైటిల్‌తో క‌లిపి మొత్తం మూడు టైటిళ్ల‌ను త‌న ఖాతాలో వేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement