Friday, April 26, 2024

కోబ్రా చిత్రం నుండి స్పెష‌ల్ సాంగ్ – రేపే రిలీజ్

త‌మిళ స్టార్ హీరో విక్ర‌మ్ న‌టిస్తోన్న తాజా చ‌త్రం కోబ్రా..ఈ చిత్రం నుండి అధీరా అనే స్పెష‌ల్ సాంగ్ తెలుగు వెర్ష‌న్‌ను సోమ‌వారం సాయంత్రం 6 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఇప్ప‌టికే త‌మిళంలో ఈ సాంగ్‌ ఛార్ట్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఏ.ఆర్ రెహామాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో స్టార్ హీరో విక్ర‌మ్‌కు జోడీగా ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించింది. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్డూడియోస్ ప‌తాకంపై ఎస్‌.ఎస్‌. ల‌లిత్ కుమార్ అత్యంత ప్ర‌తిష్ఠాత్మకంగా నిర్మించారు. ప్ర‌ముఖ దిగ్గ‌జ క్రికెట‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ విల‌న్ గా క‌నిపించ‌నున్నారు. అజ‌య్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం అదే పేరుతో తెలుగులో విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఆగ‌స్టు 11న త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏక‌కాలంలో విడుద‌ల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement