Friday, May 24, 2024

ఫ్లిప్‌కార్ట్ నుంచి అప్​డేట్​.. “బిగ్ దసరా సేల్”​లో భారీ ఆఫ‌ర్లు !

ఈ-కామర్స్ సంస్థ‌ ఫ్లిప్‌కార్ట్ మరో భారీ సేల్‌ను ప్ర‌క‌టించింది. ఇటీవలే బిగ్ బిలియన్ డేస్ సేల్స్ పేరిట సేల్స్ నిర్వహించింది. తాజాగా దసరా పండుగ నేపథ్యంలో ‘బిగ్ దసరా సేల్’ పేరుతో మ‌రో సేల్ ను నిర్వహించ‌నుంది. ఈ సేల్ రేప‌టి నుంచి (22 నుంచి 29) ఎనిమిది రోజుల పాటు జరుగనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒకరోజు ముందు నుంచే దసరా సేల్ అందుబాటులోకి వస్తుంది.

ఈ ‘బిగ్ దసరా సేల్’లో భాగంగా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, హోం అప్లియెన్సెస్, దుస్తులపై ఆఫర్లు అందచేస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఇప్పటికే మోటరోలా ఎడ్జ్ 40, ఒప్పో రెనో 10 5జీ, గూగుల్ పిక్సెల్ 7ఏ, శాంసంగ్ ఎస్ 22 5జీ, పోపో ఎఫ్5, వివో టీ2 ప్రో తదితర మొబైల్ ఫోన్లపై ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపింది.

ఐ-ఫోన్ 14తోపాటు పలు స్మార్ట్ ఫోన్లపై త్వరలో ఆఫర్లు ప్రకటించనున్నది. ఇంతకు ముందు బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో ఆఫర్ మిస్ అయిన వారు ఈ సేల్‌లో బెనిఫిట్ పొందొచ్చు. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్బీఎల్, ఎస్బీఐ కార్డు హోల్డర్లపై పది శాతం డిస్కౌంట్ అందిస్తున్నది. సూపర్ కాయిన్ల ద్వారా ఐదు శాతం అదనపు డిస్కౌంట్ అందుకోవచ్చునని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement