Sunday, April 2, 2023

అంజనా దేవి బ‌ర్త్ డే.. జ‌న్మ జ‌న్మ‌ల‌కి నీ క‌డుపునే పుట్టాల‌మ్మా.. చిరంజీవి ట్వీట్

మెగాస్టార్ చిరంజీవికి త‌న త‌ల్లి అంజనాదేవి అంటే ఎన‌లేని ప్రేమ‌..అందుకే ఎంత‌మంది పిల్ల‌లు ఉన్నా త‌న త‌ల్లిని త‌న‌వ‌ద్దే ఉంచి జాగ్ర‌త్త‌గా చూసుకుంటారు. కాగా నేడు అంజ‌నాదేవి బర్త్ డే. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అంజనాదేవి పుట్టినరోజు నాడు ఆమె ఐదుగురు పిల్లలు చిరంజీవి ఇంటికి చేరుకుంటారు. ఈ ఏడాది కూడా నాగబాబు, పవన్ క‌ల్యాణ్, ఇద్దరు కూతుళ్లు అంజనాదేవి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. అమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు మిగతా కుటుంబ సభ్యులు కూడా వేడుకల్లో భాగమయ్యారు. ఈ ఫోటోలు చిరంజీవి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. మాకు జన్మను, జీవితాన్ని ఇచ్చిన అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. జన్మజన్మలకు మీ కడుపునే పుట్టాలని కోరుకుంటున్నాను.. అని చిరంజీవి ఎమోషనల్ విషెస్ తెలియజేశారు. అంజనాదేవి బర్త్ డే విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. చిరు తల్లి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement