Sunday, April 28, 2024

పనితీరు బాగోలేని అధికారులు మెమోలు జారీ చేయాలి: జగన్

ఏపీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని అధికారులకు మెమో జారీచేయాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వారానికి నాలుగు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శించాలని సూచించారు.

క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకుంటే సమస్యలు ఎలా తెలుస్తాయని అధికారులను సీఎం జగన్ ప్రశ్నించారు. కలెక్టర్లు, జేసీల పనితీరు బాగుందని.. వారిని ఆదర్శంగా తీసుకుని మిగిలిన అధికారులు కూడా పనిచేయాలని సీఎం జగన్ తెలిపారు. అధికారులకు మోమో ఇవ్వడమంటే.. ఒకరకంగా తన పనితీరుపై తానే మెమో ఇచ్చుకున్నట్లు అని జగన్ అభిప్రాయపడ్డారు. 100 శాతం గ్రామ, వార్డు సచివాలయాల్లో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పేదల గురించి ఆలోచించి అధికారులు మానవత్వం చూపించాలని సీఎం సూచించారు.

మరోవైపు ఆగస్టు 10న నేతన్న నేస్తం, ఆగస్టు 16న విద్యాకానుక అందజేస్తామని జగన్ ప్రకటన చేశారు. రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు ఆగస్టు 24న నగదు జమ చేస్తామని తెలిపారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు, స్పిన్నింగ్‌మిల్స్‌కు ఆగస్టు 27న ఇన్సెంటివ్‌లు ఇస్తామని, ఈ మేరకు కలెక్టర్లు సన్నద్ధంగా సీఎం వైఎస్‌ జగన్ ఆదేశించారు.

ఈ వార్త కూడా చదవండి: జూనియర్ మీరాబాయి చానూ… వీడియో వైరల్

Advertisement

తాజా వార్తలు

Advertisement