Thursday, May 2, 2024

జూనియర్ మీరాబాయి చానూ… వీడియో వైరల్

టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి మొదటి పతకాన్ని అందించి చరిత్ర సృష్టించిన మీరాబాయి చానూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెను స్ఫూర్తిగా తీసుకున్న ఓ చిన్నారి వెయిట్ లిఫ్టర్‌గా ఫోజులిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నారి వెనుక టీవీలో మీరాబాయి జాను దృశ్యాలు కనిపిస్తుండగా ఆమె ఎలా చేస్తుందో సేమ్ టూ సేమ్‌గా ఈ చిన్నారి అనుకరిస్తోంది.

అయితే ఈ చిన్నారి ఎవరో కాదు వెయిట్ లిఫ్టర్ సతీష్ శివలింగం కుమార్తె. భారత మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను టోక్యో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన నేపధ్యంలో తన కుమార్తె ఆమెను అనుకరిస్తున్న దృశ్యాలను సతీష్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీడియోలో తానో పెద్ద అరితేరిన క్రీడాకారిణాలా ఫోజులిస్తూ చిన్నారి బరువు ఎత్తటాన్ని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోను 54 వేల మంది లైక్ చేశారు. కాగా ఇప్పటికే ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మీరాబాయి చానూకు మణిపూర్ ప్రభుత్వం ఎఎస్పీగా ఉద్యోగమిచ్చింది. కోటి రూపాయల పారితోషికం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ వార్త కూడా చదవండి: మీరాబాయి చానూకు రైల్వేశాఖ బంపర్ ఆఫర్

Advertisement

తాజా వార్తలు

Advertisement