Friday, May 3, 2024

శివ కార్తికేయన్ తెలుగు సినిమాలో రష్మిక మందన్న ?

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పేరుకు తమిళ్ హీరో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా శివకార్తికేయన్ సుపరిచితులు. అయితే శివ కార్తికేయన్ ఆఖరుగా 2019లో హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత కరోనా కారణంగా చాలా సినిమాలు లైన్ లోనే ఉండిపోయాయి. అయితే ఇటీవల శివ కార్తికేయన్ హీరోగా జాతిరత్నాలు సినిమా డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్నట్లు వార్తలు వచ్చాయి.

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని హిందీ, మలయాళం భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారట. అలాగే ఇందులో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుందట.

Advertisement

తాజా వార్తలు

Advertisement